హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ గనుల నిర్ణయాలపై హైకమాండ్ వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajashekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. పలు వివాదాస్పద నిర్ణయాలను, తన అస్మదీయులకు కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న ఉదంతాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతూ ప్రభుత్వపరంగా నిర్ణయాలకు పూనుకుంది. బయ్యారం గనుల లీజు ఇందుకు తాజా ఉదాహరణ. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి విశేషంగా సంపదను సమకూర్చి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు సమీప బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డిని గనుల శాఖ మంత్రిగా నియమించడం ఇందులో భాగమేనని అంటున్నారు. జగన్ ఆర్థికంగా బలపడడానికి ప్రధాన వనరు గనులేననే అభిప్రాయం కూడా ఉంది.

రోశయ్య ముఖ్యమంత్రి కాగానే కర్నాటక మంత్రి, వైయస్ కు అత్యంత సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై కూడా అధిష్ఠానం పోరాటం సాగిస్తోంది. గాలి జనార్దనరెడ్డి సాగిస్తున్న గనుల తవ్వకాల్లో ఇక్కడి పెద్దలకు వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురం అక్రమాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. అడ్గగోలుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను కూడా కీలక బాధ్యతల నుంచి తప్పించింది. ఇదే కాకుండా చీమకుర్తి గ్రానైట్‌ తదితర వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జగన్‌ వర్గానికి కూడా చెక్‌ పెట్టవచ్చనేది ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా చెబుతున్నారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X