వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో రోజు తెలంగాణ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Heavy Rains
విశాఖపట్నం: హైదరాబాద్ లో గత 36 గంటలుగా ఓ మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో ఎక్కువ చోట్ల ఒక మోస్తరు నుంచి భారీగా, రాయలసీమలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

వాయవ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దీంతో కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. అటు కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నూజివీడులో 10 సెంటీ మీటర్లు, అవనిగడ్డ, భీమవరంలలో 9, నర్సంపేట, తెనాలిల్లో 8, అచ్చెంపేట, కోడూరులో 7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యింది.

గుంటూరు, మచిలీపట్నం, కంభం, ఏలూరు, కైకలూరు, పిడుగురాళ్లల్లో 6, కాకినాడ, నందిగామ, విజయవాడ, అమలాపురం, చింతలపూడి, కూనవరం, మంగళగిరి, పాలేరుబ్రిడ్జి, వనపర్తిల్లో 5, ధవళేశ్వరం, గోల్కొండ, జూరాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కొమరాడ, రేపల్లె, సత్తెనపల్లె, సంగారెడ్డి, తణుకు, వీరఘట్టంలలో 4, మెదక్, అరకు, మంచిర్యాల, భీమడోలు, పోలవరం, గుడివాడ, తిరువూరు, హుజూరాబాద్, కోయిదా, మధిర, మహబూబాబాద్, పరకాల, మందస, పాతపట్నం, రాజమండ్రిలలో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X