వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికలపై సాక్షి మార్కు విశ్లేషణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Shakshi daily
హైదరాబాద్: తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమిపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు సాక్షి చానెల్ తన మార్కు విశ్లేషణను ప్రసారం చేసింది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ నాయకత్వ అసమర్థతపై కూడా అది అక్కసు వెళ్లగక్కింది. సమర్థుడైన నాయకుడు లేకపోవడం వల్లనే కాంగ్రెసు ఓటమి పాలైందని వ్యాఖ్యానించింది. పార్టీ అధిష్టానానికి రాష్ట్ర పరిస్థితులను వివరించే సమన్వయకర్త లేకపోవడం పెద్ద లోపమని అభిప్రాయపడింది. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభం కాగానే సాక్షి చానెల్ వైయస్ జగన్ కు అనుకూలంగా ఓ వార్తాకథనాన్ని వండి వార్చింది. డిఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి మాత్రమే పరిమితమై ఉప ఎన్నికల్లో పార్టీని నడిపించే నేత లేకుండా పోయాడని చెప్పింది.

తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఉప ఎన్నికల్లో బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేసింది. అనవసరమైన వ్యాఖ్యల ద్వారా పార్టీలో కుమ్ములాటలకు వారు కారణమయ్యారని వ్యాఖ్యానించింది. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను తెలంగాణ కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించడంపై పరోక్ష వ్యాఖ్యలు గుప్పించింది. అదే సమయంలో జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు పార్టీలోని తమ ప్రత్యర్థులపై కత్తులు దూశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి గెలుపు బాటలో నడిపించే నాయకుడు లేకుండా పోయారని మాజీ కొండా సురేఖ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. గెలుపు బాధ్యతను ఏ ఒక్కరు కూడా స్వీకరించలేకపోయారని విమర్సించారు. సమర్ధుడైన నాయకుడు లేకుండా పోయాడని, అందుకే కాంగ్రెసు ఓడిపోయిందని విమర్సించారు. మొత్తం మీద, జగన్ కు నాయకత్వం అప్పగించకపోవడం వల్లనే కాంగ్రెసు ఉప ఎన్నికల్లో ఓడిపోయిందనే అర్థం వచ్చేలా సాక్షి చానెల్ వార్తాకథనం, జగన్ వర్గీయుల వ్యాఖ్యలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X