హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ బాధ్యతారహితమైన వ్యక్తి: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బాధ్యతారహితమైన వ్యక్తి అని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి పొందడానికి వైయస్ జగన్ ఆతురత పడుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆస్తులు వారసత్వంగా వస్తాయి గాని పదవులు వారసత్వంగా వస్తాయా అని ఆయన ప్రశ్నించారు.

వైయస్ జగన్ వల్ల కోట్లు సంపాదించుకున్నవారే మళ్లీ కోట్లు సంపాదించుకోవడానికి ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీలోని అసాంఘిక శక్తులను పార్టీ అధిష్టానం సహించబోదని ఆయన అన్నారు. జగన్ కు అనుకూలంగా, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖపై ఆయన విరుచుకుపడ్డారు. పార్టీలో ఉన్నారో, లేదో కొండా సురేఖ తేల్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X