వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్ నన్ను మోసం చేశాడు: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మొదట్నుంచీ తనకు రజనీకాంత్‌ స్ఫూర్తి అని, కానీ ఒక విషయంలో మాత్రం నన్ను మోసం చేశాడని ప్రజారాజ్యం పార్దీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. 'శివాజీ' తర్వాత రాజకీయాల్లోకి వస్తాడనుకొన్నానని, అందుకే ముందుగా తానే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని, వెనక్కి తిరిగి చూస్తే తను మాత్రం ఇంకా 'రోబో' లాంటి సినిమాలు చేస్తూ అక్కడే ఉండి పోయాడని ఆయన అన్నారు. రోబో చిత్రం ఆడియో తొలి సీడీని చిరంజీవి శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు.

స్నేహానికి అర్థం తెలిసినవాడు రజనీకాంత్‌. 35 యేళ్లుగా తమ స్నేహం కొనసాగుతోందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. 'పెదరాయుడు' సినిమా కోసం రజనీకాంత్ అన్ని విధాలుగా తనకు సహాయం చేశాడని, ఈ సినిమా కోసం రజనీ పడిన కష్టం తాను కళ్లారా చూశానని, 'రోబో' గొప్ప విజయం సాధించాలని అన్నారు. రోబోలో మూడు విషయాలు ప్రధానమని, ఒకటి కథ, రెండోది రజనీకాంత్‌, మూడోది విజువల్‌ ఎఫెక్ట్స్‌ అని ఆయన అన్నారు. కళానిధి మారన్‌ లేకపోతే ఈ సినిమాయే లేదని అన్నారు. ఈ సినిమా గురించి నాలుగు మాటల్లో చెప్పలేనని, ఏకంగా ఓ పుస్తకమే రాయాలనిపిస్తోందని, 'రోబో' ముందు షారుఖ్‌ఖాన్‌తో తీద్దామనుకొన్నారని, ఏమైందో ఏమో ... శంకర్‌ నాకు ఫోన్‌ చేసి 'రోబో'లో మీరు చెయ్యాలి అన్నారని రజనీకాంత్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X