హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మరక్షణలో సీమాంధ్ర మంత్రులు: మాట మార్చిన గాదె

By Pratap
|
Google Oneindia TeluguNews

Gade Venkat Reddy
హైదరాబాద్: సీమాంధ్ర మంత్రులు ఆత్మరక్షణలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తున్నవారిని దేశద్రోహులుగా అభివర్ణించడంపై తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే కాకుండా సొంత కాంగ్రెసు పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శలు రావడంతో వారు వెనక్కి తగ్గక తప్పలేదు. తాము దేశద్రోహులనే మాట అనలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. సీమాంధ్ర మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని అనడం దారుణమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేతలు తమపై విమర్శలు చేయడం శోచనీయమని ఆయన అన్నారు.

సీమాంధ్ర నేతలను తెలంగాణలో తిరగనివ్వమన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ మాటలకు కాంగ్రెసు పార్టీలోని వారే వంత పాడడం బాధాకరమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడదీయడం దేశద్రోహులని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. గాదె, ఇతర సీమాంధ్ర మంత్రుల వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రంగా మండిపడడమే కాకుండా తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. సోమవారం తెలంగాణలో నిరస కార్యక్రమాలు జరిగాయి. సీమాంధ్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీమాంధ్ర మంత్రులు తమ వ్యాఖ్యను ఉపసంహరించుకోకపోతే తాము సహించబోమని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవ రావు హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X