• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ అల్లుడి గనులపై పోరు: సిపిఐ నేత నారాయణ అరెస్టు

By Pratap
|
Narayana
ఖమ్మం: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు సంబంధం ఉందని ఆరోపిస్తున్న బయ్యారం గనులకు వ్యతిరేకంగా సిపిఐ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. బయ్యారం గనుల అక్రమాలను నిరసిస్తూ ఖమ్మం జిల్లా పాలేరు వంతెనపై భైఠాయించి నిరసన తెలియజేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పువ్వాడ నాగేశ్వరరావు తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

గనుల అక్రమాలను అడ్డుకోకపతే రాష్ట్రంలో మైనింగ్‌ మాఫియా రాజ్యమేలే ప్రమాదముందని నారాయణ అంతకు ముందు అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు వంతెన వద్ద వర్షంలో సైతం నారయణ, పువ్వాడ తదితర నేతలు భైఠాయించి బయ్యారం గనుల అక్రమాలపై నిరసన తెలియజేశారు. గనుల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్‌ మన రాష్ట్రంలో ఒక తీరుగా, కర్ణాటకలో మరో తీరుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బయ్యారంలో ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వమే వెలికితీసి, పరిశ్రమ స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో భూగర్భ సంపదను కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు, కిందిస్థాయి నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X