హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు శ్రీరామ్ కే ఇండియన్ ఐడల్ పట్టాభిషేకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sreerama Chandra
హైదరాబాద్: భారత స్వాత్యంత్ర దినోత్సవం ఆగస్టు 15న తెలుగు తేజం శ్రీరామ్‌ మహోన్నత శిఖరాన్ని అధిరోహించాడు. ఇండియన్‌ ఐడల్‌గా ఆవిర్భవించాడు. సోనీ టీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇండియన్‌ ఐడల్‌-5 మ్యూజిక్‌ రియాలిటీ షోలో శ్రీరామ్‌ విజయకేతనం ఎగురవేశాడు. పోటీలు జరుగుతున్న తొలి రోజు నుంచీ శ్రావ్యమైన తన గొంతుతో శ్రీరామ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. చివరికి ఫైనల్స్‌లో ముగ్గురు మిగిలారు. అర్థరాత్రి కాగానే మీట నొక్కగానే స్క్రీన్ పై శ్రీరామ్ పేరు వచ్చింది. దాంతో విజేత శ్రీరామ్ నిలిచాడు. ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ్‌కు సోనీటీవీ రూ.50 లక్షల నగదు బహుమతిని అందించింది. దీంతోపాటు ఒక బైక్‌, ఒక కారు కూడా ఇచ్చారు. విజేతతో ఒక సంవత్సరంపాటు సోనిటీవీతో ఒప్పందం కూడా ఉంటుంది. యాశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌లో పాట పాడే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమాన్ని తాను సెలక్షన్స్‌ జరుగుతున్నప్పటి నుంచీ చూసినట్లు బిగ్‌ బీ అమితాబ్‌ చెప్పారు. తన శ్రీమతి జయాబచ్చన్‌కు ఈ కార్యక్రమం బాగా నచ్చిందని వెల్లడించారు. అంత తేలికగా దేనినీ ఆమోదించే తత్వం ఆమెది కాదని అమితాబ్‌ మ్యూజిక్‌ రియాలిటీ షో కార్యక్రమాన్ని ఆకాశానికి ఎత్తేశారు. రాకేష్ మణి రెండో స్థానంలో నిలువగా, భూమి త్రివేది మూడో స్థానంలో నిలిచింది.

ఇండియన్ ఐడల్ ఫైనల్ కు వెళ్లినా ఎవరు గెలుస్తారనేది చివరి వరకు చెప్పడం కూడా కష్టమే. కార్యక్రమాన్ని చూసి ఎవరు బాగా ప్రతిభను చూపించారన్నది అభిమానులు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వారికి మద్దతు ప్రకటించాలి. పాటలు పాడటంలో ఎంత ప్రతిభ ఉన్నా, సెల్‌ఫోన్ల ద్వారా సంక్షిప్త సందేశాలు రావడం కూడా ముఖ్యమే. ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో కారుణ్య ఫైనల్స్‌కు చేరినా ఎస్ ‌ఎంఎస్ ‌ల్లో వెనకబడిపోవడంతో ఆయన రన్నరప్‌గా నిలిచాడు. ఈసారి శ్రీరామ్‌ గెలుపును కోరుకుంటూ చాలా మంది ఎస్‌ఎంఎస్‌లు పంపడం శ్రీరామ్‌కు కలిసివచ్చింది. అభిజీత్‌ సావంత్‌, సందీప్‌ ఆచార్య, ప్రశాంత్‌ తమాంగ్‌, సౌరభీలు ఇంతకుముందు ఇండియన్‌ ఐడల్స్‌గా విజయం సాధించారు. ప్రస్తుత విజేత శ్రీరామ్‌ ఈటీవీ నిర్వహించిన 'ఒక్కరే' పోటీలో విజేతగా నిలిచాడు. ఈటీవీ 'సై' ఫైనలిస్ట్‌. బిగ్‌ ఎఫ్‌ ఎంలో 'వాయిస్‌ ఆఫ్‌ ఆంధ్రా'గా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకూ 5 తెలుగు సినిమాల్లో పాటలు పాడిన శ్రీరామ్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నాడు. సంగీతంలో ప్రవేశం ఉంది. సందీప్‌-సులేమాన్‌ కంపోజ్‌ చేసిన ఒక హిందీ సినిమాకు శ్రేయా ఘోషల్‌తో కలిసి ఒక పాట పాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X