ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరులోని కోర్టు ఆవరణలో రౌడీ షీటర్ దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
ఏలూరు: రవి అనే రౌడీ షీటర్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టు సమీపంలో అతన్ని అతి సమీపం నుంచి దుండగులు కాల్చి చంపారు. దుండగుడు మోటార్‌సైకిల్‌ పై వచ్చి తుపాకీతో రవిపై కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలోనే తుపాకీ వదిలి పరారయ్యాడు. తాడేపల్లిగూడానికి చెందిన రవి పలు కేసుల్లో నిందితుడు.

రవిపై 11 హత్య కేసులతో పాటు 32 కేసులున్నాయి. వీటిలో రేప్, కిడ్నాప్ కేసులున్నాయి. కొన్ని కేసుల్లో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పాతకక్షలతోనే ప్రత్యర్థులు రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్పుల అనంతరం దుండగులు తుపాకిని ఘటనాస్థలంలోనే వదిలి వెళ్లారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X