• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'సత్యం' రాజు ఆరోగ్యంపై మా నివేదిక నిజమే: నిమ్స్ వైద్యులు

By Pratap
|

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగ రాజు ఆరోగ్యంపై తాము ఇచ్చిన నివేదికలో తప్పు లేదని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు స్పష్టం చేశారు. రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వారు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాజుకు మరో నాలుగు నెలల పాటు చికిత్స అవసరమని వారు చెప్పారు. రాజు హెపటైటిస్ బితో బాధపడుతున్నారని వారు చెప్పారు. ఇప్పటి వరకు 30 ఇంజక్షన్లు ఇచ్చామని, మరో 18 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉందని వారు చెప్పారు.

రాజు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని వారు చెప్పారు. కాలేయం పూర్తిగా దెబ్బ తిన్నదని వారు చెప్పారు. తాము ఇచ్చిన బ్లడ్ కౌంట్ నిజమేనని, రాజుకు ఆరోగ్య సమస్య నిజమేనని వారు చెప్పారు. రామలింగరాజు ఆరోగ్యాన్ని ఇతర వైద్యులు కూడా పరీక్షించవచ్చునని వారన్నారు. ఆస్పత్రి నుంచి వెళ్లాలని తాము రామలింగ రాజుపై ఒత్తిడి తేలేమని వారు చెప్పారు. బెయిల్ ఇస్తే రామలింగరాజు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానాలు అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది భరత్ కుమార్ అన్నారు. సత్యం కంప్యూటర్స్ ప్రస్తుతం మహీంద్రా చేతిలో ఉందని, రాజు చైర్మన్ గా కూడా లేరని, అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేయడం సాధ్యం కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనికి సంబంధించి అన్ని విషయాలను కోర్టు ముందుంచామని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X