వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీచ్ లో నాలుగు మృతదేహాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kakinada
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీచ్ లో శుక్రవారం ఉదయం నాలుగు మృతదేహాలు కనిపించాయి. సముద్రంలోంచి ఆ వాహనాలు కొట్టుకువచ్చినట్లు భావిస్తున్నారు. శవాలు పూర్తిగా ఉబ్బి ఉన్నాయి. మృతుల్లో ఓ 50 ఏళ్ల మహిళ, మరో 30 ఏళ్ల మహిళ, ఇద్దరు మగ పిల్లలున్నారు. వారి ఆనవాళ్లు ఏమిటనేది తెలియడం లేదు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నోటి నుంచి నురగలు వచ్చిన దాఖలాలున్నాయి. అందువల్ల వారు ముందు పురుగుల మందు తాగి సముద్రంలో దూకినట్లు అనుమానిస్తున్నారు. అయితే, వారెందుకు ఆత్మహత్య చేసుకున్నారు, వారెవరు అనే విషయాలు తెలియడం లేదు. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X