హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి బ్రదర్స్ కు వైయస్సార్ బాసట: వి హనుమంతరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి సోదరులను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు నిందించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చేందుకు గాలి సోదరులు కుట్ర పన్నుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెసులో గాలి సోదరులకు ఎవరెవరు సహకరిస్తున్నారన్న విషయాలు అధిష్టానానికి తెలుసని, వీరిపై తగిన సమయంలో చర్య తీసుకుంటారని అన్నారు.

గాలి అనుచరులకు గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మద్దతు ఇచ్చారని, వారితో కలిసి అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించారని అన్నారు. వైయస్ హయాంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టికెట్లు దక్కనివారు నిరాశను వదిలి చురుగ్గా పనిచేయాలంటే వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X