హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విదేశీయుల ఇళ్లపై పోలీసు దాడులు: ఏడుగురు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: డ్రగ్ సరఫరా చేస్తూ రవితేజ సోదరులతో పాటు ఉగండా దేశీయుడు క్లెమెంట్ పట్టుబడడంతో పోలీసులు హైదరాబాదులోని విదేశీయుల ఇళ్లపై దృష్టి సారించారు. హైదరాబాదులోని ఉగండా, నైజీరియా, తదిర విదేశీయుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాదులోని హుమాయున్ నగర్, లంగర్ హౌస్, గోల్కొండ, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు.

దాడుల సందర్బంగా వీసాల గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఉగండా, నైజీరియన్లు డ్రగ్ సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు కూడా డ్రగ్ సరఫరాలో పట్టుబడిన వారు ఈ దేశీయులే కావడం గమనార్హం. దాడులకు మూడు పోలీసు టీమ్ లను ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X