హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్లమెంటు ముట్టడికి సహకరిస్తా: అజిత్ కు బాబు హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: రైతు సమస్యలపై, భూసేకరణపై ఈ నెల 26వ తేదీన తలపెట్టిన పార్లమెంటు ముట్టడికి సహకరిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) నేత అజిత్ సింగ్ కు హామీ ఇచ్చారు. అజిత్ సింగ్ సోమవారంనాడు చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. భూసేకరణపై స్పష్టమైన చట్టం తేవాలని, ఆర్థిక మండళ్ల ఏర్పాటులో రైతులకు భాగస్వామ్యం కల్పించాలని అజిత్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇవియంల పనితీరును తప్పు పట్టినందుకు హరిప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం తగదని ఆయన అన్నారు. తాము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, అయితే చంద్రబాబుతో తెలంగాణ గురించి మాట్లాడలేదని ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

సెజ్ ల కోసం ప్రభుత్వం రైతుల భూములను ఇష్టారాజ్యంగా సేకరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. రైతులకు చాలా తక్కువ ధర చెల్లిస్తోందని, మార్కెట్లో లక్షలాది రూపాయలు ఉంటే రైతులకు మాత్రం వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్లమెంటు ముట్టడికి సహకరిస్తామని అజిత్ సింగ్ కు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులు కూలీలుగా మారడమే కాకుండా వారు పొందిన నష్టపరిహారంతో ఇంటి జాగా కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లపై కేంద్ర ఎన్నికల సంఘం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని చంద్రబాబు అన్నారు. ఈవీఎంల పనితీరుపై అన్ని పార్టీల్లో సందేహాలు నెలకొన్నాయని తెలిపారు. ఈవీఎంల డొల్లతన్నాన్ని బయటపెట్టిన నిపుణుడు హరిప్రసాద్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈవీఎంల అవతవకలపై అన్ని పార్టీ మద్దతుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై మంగళవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X