హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైరాబాను, జ్యోతి ఆ టేపేనంటున్న పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Saira Bhanu
హైదరాబాద్: తాము అమాయకులమని, తమను కేసుల్లో ఇరికించారని అంటున్న వర్ధమాన తారలు సైరాబాను, జ్యోతిల వ్యాఖ్యలను పోలీసులు ఖండిస్తున్నారు. తమను 'ట్రాప్' చేశారన్న సైరాబాను, జ్యోతి వాదనలను పోలీసులు ఖండించారు. "వారు వ్యభిచారం నిర్వహిస్తున్నందునే పట్టుకున్నాం. ఆ గదిలో ఏం జరిగిందో నిరూపించగలం. అందుకు సంబంధించిన వీడియో, ఆడియో సాక్ష్యాలు ఉన్నాయి. సెక్స్ వర్కర్లను బాధితులుగా గుర్తించి, వారి తదుపరి ప్రయోజనాలను కాపాడాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆధారాలను బయటపెట్టడంలేదు. అనుమానం ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలెవరనా వస్తే ఆధారాలు చూపిస్తాం'' అని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

సినిమాలో వ్యాంప్ పాత్ర వేసినంత మాత్రానే నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని అనుకోవద్దని, తాము బాధితులమేనని, నిందితులం కాదని జ్యోతి, సైరాబాను మీడియాతో అన్నారు. సినిమాల్లో ఆఫర్ గురించి మాట్లాడేందుకే తాము ఫ్లాట్‌కు వెళ్లామని తెలిపారు. సెక్స్ రాకెట్ ప్రచారాన్ని కొట్టివేశారు. తమను అనవసరంగా ఈ వివాదంలో ఇరికించారని చెప్పారు. రిమాండ్, బెయిలు అనేదేమీ లేదని, తమను బాధితులుగా గుర్తించి, స్వేచ్ఛగా ఇంటికి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలతో విడుదలైన తర్వాత సైరాబాను, జ్యోతి తమకు అందుబాటులో ఉన్న టీవీ చానెళ్లలో మాట్లాడారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X