వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా నుంచే ఉగ్రవాద ఎగుమతి: వికీలీక్స్ వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

WikiLeaks
వాషింగ్టన్: అమెరికానే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందని వికీలీక్స్ వెల్లడించింది. తాజాగా వికీలీక్స్ వెబ్ సైట్ అంతర్గత కేంద్ర నిఘా సంస్థ (సిఐఎ) రహస్య నివేదికను బయటపెట్టింది. మూడు పేజీల సిఐఎ రహస్య పత్రాన్ని వికీలీక్స్ బుధవారం బహిర్గతం చేసింది. హింసాత్మక చర్యలకు దిగుతున్న చాలా మంది అమెరికా నుంచి విదేశాలకు పర్యటనలు సాగిస్తున్నారని తెలిపింది. అందుకు పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీని ఉదహరించింది. 2008లో ముంబై ఊచకోతలో హెడ్లీ పాత్ర గురించి తెలిసిందే. అలాగే, 1994లో డజన్ల కొద్ది పాలిస్తీన్లను చంపిన యూదు ఉగ్రవాది బరూచ్ గోల్డ్ స్టీన్ ను కూడా ఉదాహరణగా పేర్కొంది.

అమెరికాను ఉగ్రవాద ఎగుమతి దేశంగా విదేశీయులు చూస్తే ఏమవుతుందనే శీర్షిక కింద ఆ పత్రాన్ని సిఐఎ రూపొందించింది. మరో 15వేల పేజీల రహస్య పత్రాలను త్వరలోనే బయపెడతామని వికీలీక్స్ తెలిపింది. ఉగ్రవాదం అమెరికా నుంచే విస్తరిస్తుందనేది తాజా పరిణామమేమీ కాదని తెలిపింది. అంతేకాకుండా అది మధ్య ప్రాచ్యం లేదా దక్షిణాసియా జాతి సంబంధం మాత్రమే ఉగ్రవాదానికి కారణం కాదని వ్యాఖ్యానించింది. సొంతగడ్డకు పొంచి ఉన్న ముప్పునకు కౌంటర్ టెర్రరిజం నిపుణులు ప్రదానంగా పరిగణనలోకి తీసుకుంటారని, ఆల్ ఖైదా, ఇతర ఉగ్రవాద గ్రూపులు ఇతర దేశాల్లో పనిచేయడానికి అమెరికన్లపై దృష్టి సారించాయని నివేదిక తెలిపింది. నివేదిక ప్రాధాన్యతను తగ్గించడానికి సిఐఎ ప్రయత్నించింది. భిన్న అభిప్రాయాలను ముందు పెట్టి, ఆలోచనను రేకెత్తించడమే నివేదిక ప్రయత్నమని తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X