హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామ్ గోపాల్ వర్మకు చంపేస్తామని బెదిరింపు కాల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ram Gopal Varma
హైదరాబాద్: ప్రముఖ దర్సక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రక్త చరిత్ర సినిమాకు గాను ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామంటూ ఓబుల్ రెడ్డి అనుచరులకు చెప్పుకున్న వ్యక్తులు వర్మకు ఫోన్ బెదిరింపులు చేశారు. గతంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు బెదిరింపు కాల్స్ చేశారు. వారి ఆచూకీ తెలియలేదు.

ఓబుల్ రెడ్డిని సినిమాలో విలన్ గా చూపించినందుకు రామ్ గోపాల్ వర్మకు ఆ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. రక్త చరిత్ర సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా వారు బెదిరించారు. దారుణ హత్యకు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాను తీశారు. దీంట్లో పరిటాల హత్య కేసులో నిందితుల జీవితాలను కూడా వర్మ చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే వివాదాస్పదంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X