• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు బయ్యారం యాత్రకు తెలంగాణవాదుల భయం

By Pratap
|
Chandrababu Naidu
ఖమ్మం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బయ్యారం యాత్రకు తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. అక్రమ మైనింగ్ పై పోరులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా బయ్యారంలో సోమవారం ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో చంద్రబాబు పాల్గొంటున్నారు. చంద్రబాబును తెలంగాణవాదులు అడ్డుకుంటారనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మండల స్థాయి నాయకులను, కార్యకర్తలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లా మహబూబాబాద్ ప్రాంతంలో కూడా అరెస్టులు జరిగాయి. పోలీసులు 15 మందిని ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. బయ్యారం ఖమ్మం జిల్లాలోనే ఉన్నప్పటికీ వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. దీంతో వరంగల్ జిల్లాలోనూ అరెస్టులు సాగుతున్నాయి. బయ్యారం ప్రాంతంలో చంద్రబాబుకు భద్రతగా భారీగా పోలీసులు మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X