హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమపై నిఘా కొనసాగుతోంది: ఎకె ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారం కేసులో సినీ పరిశ్రమపై నిఘా కొనసాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్ ను సందర్శించి కేసు దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. డ్రగ్స్ కేసులో కొంత మంది పట్టుబడడంతో వ్యాపారులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారని ఆయన అన్నారు. కేసును ఛేదించి తప్పు చేసినవారికి శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖులున్నారని ఆయన అన్నారు.

డ్రగ్స్ వ్యాపారంలో ఎక్కువ మంది విదేశీయులున్నారని, వారికి స్థానికులు సహకరిస్తున్నారని, వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని ఆయన అన్నారు. ముంబై, పూణే, గోవా పోలీసులు కూడా ఈ కేసులో తమకు సహకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు ఆయన తెలిపారు. స్థానికులకు విదేశీయులతో గల సంబంధాలపై కూపీ లాగుతున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X