వైయస్ జగన్ కు మరో షాక్: వారిద్దరు ఓదార్పునకు దూరం

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకూ ఆయనకు మద్ద తు ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మంత్రాలయం శాసనసభ్యుడు వై.బాలనాగిరెడ్డి ఓదార్పు యాత్రకు దూరం కానున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ దార్పు తర్వాత నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తే, జగన్‌కు కోవూరులో భారీ ఊరేగింపుతో స్వాగతం పలుకుతానంటూ ప్రసన్న ప్రకటించారు. కానీ ఆయన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ప్రసన్న, బాలనాగిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ జాప్యం చేస్తున్నారని, దీనిపై ఒక దిశానిర్దేశం చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తెలుగుదేశం వ్యూహం గురిం చి తెలుసుకున్న నల్లపురెడ్డి దీనిని ఎదుర్కోవడానికి న్యాయవాదులను సంప్రదించారు. వారు కూడా వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వేటు తప్పదని తెలిపారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వీరు యాత్రకు దూరం గా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+