హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వర్గీకరణ వైఖరిపై సీరియస్: తెలంగాణ భవన్ ముట్టడి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వైఖరిపై తెలంగాణ ఉద్యమ జెఎసి గురువారం భగ్గుమంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరుతూ కెసిఆర్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యమ జెఎసి కార్యకర్తలు తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ ను ముట్టడించారు. మాల మాదిగల్లో చిచ్చు పెట్టడానికి కెసిఆర్ ఆ లేఖ రాశారని తెలంగాణ ఉద్యమ జెఎసి నాయకులు విమర్శించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న కెసిఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఎందుకు ఎత్తుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాధించాలనే చిత్తశుద్ధి కెసిఆర్ కు లేదని వారన్నారు. తెలంగాణ పేరుతో 300 మంది విద్యార్థులను కెసిఆర్ పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు. వివిధ సంఘాలను చీల్చడమే కెసిఆర్ ధ్యేయంగా పెట్టుకున్నారని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X