గ్రూప్ వన్ పరీక్ష వాయిదా మా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ

గ్రూప్ వన్‌లో తెలంగాణకు 42 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం నేత నాగం జనార్థనరెడ్డి అన్నారు. ఈ అంశంపై తెలంగాణ టీడీపీ ఫోరం తరపున ఈరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రూప్ వన్ పరీక్ష వాయిదా వేయాలనటం సబబుకాదని, అది విద్యార్థులకు నష్టమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పరీక్షకు ఇప్పటికే విద్యార్థులు సిద్ధమయ్యారని గతంలో కూడా ఎన్నోసార్లు ఈ పరీక్షలు వాయిదాపడ్డాయని మళ్లీ వాయిదాపడితే విద్యార్థులు మానసికంగా దెబ్బతింటారని అన్నారు. తెలంగాణతో గ్రూప్ వన్ పరీక్షలను ముడి పెట్టవద్దని ఆయన అన్నారు.
గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకూడదని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు శైలజానాథ్ కూడా అన్నారు. పరీక్ష వాయిదా వేయాలని తెలంగాణ నాయకులు కోరుతుండగా, వాయిదా వద్దని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం వర్శిటీల బంద్‌కు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications