హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ముందు రామోజీ, బాబు దూదిపింజలు: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముందు ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దూదిపింజలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ ముందు వారు రాజకీయంగా నలిగిపోతారని ఆయన మంగళవారం మీడియా ప్రతిధుల సమావేశంలో అన్నారు. జగన్ కు లభిస్తున్న ప్రజా స్పందనను మర్చిపోయి రామోజీ రావు, చంద్రబాబు అవాకులు చెవాకులు రాస్తున్నారు, మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు కడప జిల్లా నుంచి ప్రజలను తరలించాలని ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తాకథనంపై ఆయన మండిపడ్డారు. ఏం చేశారని వైయస్ కోసం ఓదార్పు యాత్ర చేస్తారని ప్రశ్నించిన చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు.

చంద్రబాబు కాంగ్రెసులో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీలో చేరి మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, వైయస్ ప్రజాసేవలో తరించారని, వైయస్ చేతిలో చంద్రబాబు తుక్కుతుక్కుగా ఓడిపోయారని ఆయన అన్నారు. వైయస్ ను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. వైయస్ ను యోగి, మహానుభావుడిగా ఆయన అభివర్ణించారు. వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనకు అధికారులు కల్పిస్తున్న అడ్డంకులపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు. గుంటూరు జిల్లా చీరాలలో, నెల్లూరులో వైయస్ విగ్రహానికి ఏర్పడిన అడ్డంకులను ఆయన ఉదహరించారు. వైయస్ విగ్రహ ప్రతిష్టాపనలకు అధికారుల అనుమతి సత్వరమే లభించేలా ముఖ్యమంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. వైయస్ విగ్రహాల స్థాపనకు అధికారులు అడ్డుపడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక అధిపతి రోశయ్య అని, తాత్కాలిక చైర్మన్ అని ఆయన నవ్వుతూ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X