వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని మనిషిని కవితా కృష్ణమూర్తి భర్త లైంగికంగా వేధించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavita Krishnamurthy
బెంగళూరు: ప్రముఖ వాయెలిన్ సంగీత విద్వాంసుడు, సినీ నేపథ్య గాయని కవితా కృష్ణ మూర్తి భర్త ఎల్ సుబ్రమణ్యంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. సుబ్రమణ్యం తనను లైంగిక వేధించారని పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన పని మనిషి భాగ్యపైన, ఆమెకు సహకరించినవారిపైన చర్యలు తీసుకుంటానని సుబ్రమణ్యం అంటున్నారు. తన ఇంటి నుంచి ఆరు లక్షల రూపాయలు దొంగిలించినట్లు భాగ్యపై అంతకు ముందే సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చోరీ చేసిన సంఘటన నుంచి దృష్టి మళ్లించడానికి భాగ్య తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

సుబ్రమణ్యం తనపై అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారని, సుబ్రమణ్యం తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని భాగ్య అంటోంది. దొంగతనం చేసిందనే ఆరోపణపై భాగ్యను పని నుంచి తొలగించారు కూడా. భాగ్యను వెంట పెట్టుకుని పోలీసులు బెంగళూర్ లోని సుబ్రమణ్యం ఇంటికి కూడా వచ్చారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. సుబ్రమణ్యానికి పద్మ భూషన్, పద్మ విభూషన్ వంటి అవార్డులు వచ్చాయి. సలాం బాంబే వంటి సినిమాలకు ఆయన సంగీతం సమకూర్చారు.

కవితా కృష్ణమూర్తిని సుబ్రమణ్యం రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కవితా కృష్ణమూర్తితో కలిసి ఆయన పలు కచేరీలు కూడా చేశారు. దేశ, విదేశాల్లో ఆయన కచేరీలు చేశారు. తాను పూర్తి కాలం సంగీతానికే అంకితం అవుతానని సినిమాలకు పాటలు పాడడం కూడా కవితా కృష్ణమూర్తి మానుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X