హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమాంధ్ర ఎంపిల భేటీకి హర్షకుమార్, బొత్స ఝాన్సీ డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Harsha Kumar
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీకి వినిపించాల్సిన వాదనలపై గురువారం జరిగిన కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సమావేశానికి హర్షకుమార్, బొత్స ఝాన్సీ గైర్హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీని హైదరాబాదులోని జూబిలీ హాల్లో కలవడానికి ముందు సీమాంధ్ర ఎంపిల సమావేశం కావూరి సాంబశివరావు నివాసంలో జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించేందుకు అవసరమైన అంశాలపై వారు చర్చించారు. హర్షకుమార్, బొత్స ఝాన్సీ రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారు. రాష్ట విభజన కూడదనే ఇతర సీమాంధ్ర నేతలతో వారు విభేదిస్తున్నారు. దీంతో వారు ఈ సమావేశానికి హాజరు కాలేదని భావిస్తున్నారు.

కాగా, కేంద్ర మంత్రులు పురంధేశ్వరి, పల్లంరాజు, సాయిప్రతాప్ కూడా ఈ సమావేశానికి రాలేదు. మంత్రులు కావడం వల్ల వారు హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే, పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర విభజన అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X