హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కొమరం పులికి తెలంగాణ దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులికి తెలంగాణలో వ్యతిరేకత ఎదురవుతోంది. కొమరం పులి శుక్రవారం 600 థియేటర్లలో విడుదలైంది. అయితే, ఆ సినిమాకు తెలంగాణలో తిప్పలు తప్పడం లేదు. తెలంగాణ ఆందోళనకారులు పలు చోట్ల కొమరం పులి పోస్టర్లను దగ్ధం చేశారు. పోస్టర్లను చించేశారు. తెలంగాణలోని థియేటర్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొమరం పులిని అడ్డుకుని తీరుతామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ప్రకటించింది. తెలంగాణ ఆందోళనకారుల తాకిడితో బెనిఫిట్ షోలను రద్దు చేశారు.

తెలంగాణలో పలు చోట్ల సినిమా ప్రదర్శనను అడ్డుకోవడానికి విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొంత మందిని అరెస్టు చేశారు. కొమరం పులి టైటిల్ లో కొమరం పేరు తీసేయాలని జెఎసి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడి పేరును సినిమాకు పెట్టడంపై వారు వ్యతిరేకిస్తున్నారు. సామాజిక తెలంగాణ అని చెప్పిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X