హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్య, మోహన్ బాబు సినిమాలూ అడ్డుకుంటాం: ఒయు జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ పులికి మాత్రమే తమ ఉద్యమం పరిమితం కాదని, తెలంగాణను వ్యతిరేకిస్తున్న లేదా స్పష్టమైన వైఖరి ప్రకటించని నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి కుటుంబాలకు సంబంధించిన చిత్రాలన్నింటినీ ఇకనుండి అడ్డుకొని తీరుతామని ఓయూ జెఎసి హెచ్చరించింది. రాజకీయాలను ఒంట బట్టించుకుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్, మోహన్ బాబు, ఆయన కుమారుల చిత్రాల్ని అడ్డుకుంటామని ఓయూ జెఎసి పేర్కొంది.

పులి చిత్రం అడ్డుకోవడాన్నిప్రజా రాజ్యం నాయకులు కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నారని ఒయు జెఎసి నాయకుడు రాజారాం అన్నారు. కాని తెలంగాణలోని ప్రజల ఆకాంక్షను వారు చూడటం లేదన్నారు. ఇకనుండి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరి చిత్రాలను ఇక్కడ ప్రదర్శింపనిచ్చేది లేదన్నారు. పులిపై ప్రజారాజ్యం నాయకులు చేస్తున్న వాదనలన్నీ తెలంగాణ ద్రోహి అయిన చిరంజీవిని సంతృప్తిపర్చడానికేనన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ లో కొమరం పదాన్ని తొలగించినంత మాత్రాన సరిపోదని, సినిమాలో సంభాషణలు కూడా మార్చాలని ఒయు జెఎసి నాయకులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X