హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణ విద్యాసంస్థల అక్రమాలపై ఆధారాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: తెలుగు అకాడమి పుస్తకాలను నారాయణ విద్యాసంస్థలు కాపీ చేసినట్టు తమ దృష్టికి వచ్చినట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. తెలుగు అకాడమికి ఈ మధ్య ఆదాయం భారీగా తగ్గడంతో నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తెలుగు అకాడమీ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అకాడమికి రూ.5 కోట్లు నష్టం వచ్చినట్టు పేర్కొన్నారు. పుస్తకాలు ముద్రించిన నిషిత్ మల్టీమీడియా వెనక నారాయణ హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కుంభకోణంలో తెలుగు అకాడమిలోని కొందరి పాత్ర ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల చైర్మన్ నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. కాపీరైట్ చట్టం కింద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ పుస్తకాలను అక్రమంగా అరెస్టు చేసి డబ్బులు గడించాడనే ఆరోపణపై ఆయనపై కేసు నమోదైంది. ఆయన భార్య, కూతుర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. తెలుగు అకాడమీకి పది కోట్ల రూపాయల మేర నారాయణ తెలుగు అకాడమీకి నష్టం కలుగజేశాడని ఆరోపణలు వచ్చాయి.

నారాయణకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు అకాడమీకి చెందిన లక్షా 20 వేల పుస్తకాలను అక్రమంగా ప్రచురించి విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలు అమ్ముకున్నాయని ఆరోపిస్తున్నారు. నారాయణతో సీమాంధ్ర అధికారులు, నాయకులు కుమ్మక్కయ్యారని తెలంగాణకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ అధిపతి బాల్ రెడ్డి ఆరోపించారు. గత నెల రోజులుగా నారాయణను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆ తర్వాత నారాయణ బెయిల్ పై విడుదలయ్యారు. పోలీసు స్టేషన్లోనే ఆయన బెయిల్ తీసుకున్నారు. తాము తెలుగు అకాడమీ పుస్తకాలను కాపీ చేయలేదని, తాము సొంతంగా పుస్తకాలను రాయించుకుని ప్రచురించుకున్నామని, తమవి హై స్టాండర్డ్ పుస్తకాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X