హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలి కోసం తండ్రితో కిడ్నాప్ డ్రామా ఆడిన యాష్ గుప్తా

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో కిడ్నాప్ నకు గురైనట్లు భావించిన యువకుడు యాష్ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసులు హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లో అరెస్టు చేశారు. అతని వెంట ఓ యువతి కూడా ఉంది. ఆమె అతని ప్రియురాలని తెలుస్తోంది. ఆమె కోసమే యాష్ గుప్తా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ బంగారం వ్యాపారి కుమారుడు కిడ్నాప్ నకు గురైనట్లు అంతకు ముందు వార్తలు వచ్చాయి. యాష్ గుప్తాను కిడ్నాప్ చేశామంటూ ఆగంతకులు మంగళవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తే యాష్ గుప్తాను వదిలిపెడతామంటూ వారు హెచ్చరించారు. దీంతో యువకుడు యాష్ గుప్తా తండ్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, కిడ్నాప్ అయినట్లు యాష్ గుప్తానే డ్రామా ఆడించాడని తేలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X