ఆదిలాబాద్ జిల్లాలో వరదల బీభత్సం: గడ్డెన్నవాగుకు భారీగా నీరు
Districts
oi-Pratapreddy
By Pratap
|
ఆదిలాబాద్: భారీ వర్షాలు అదిలాబాద్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ఉదయం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు సుద్దవాగు భైంసా బైసాస్ వంతెనపైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో బాసరకు రాకపోకలు స్తంభించాయి.
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. ఉప్పుగూడ, శివగంగానగర్, హనుమాన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు భారీ వర్షానికి యూసఫ్‌గూడలోని మొదటి బెటాలియన్‌లోని 18వ నెంబర్ క్వార్టర్ కూలిపోయింది. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.