హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్నాలో విద్యార్థినిపై నడుంపై చేయి వేసిన సిఐ మనోహర్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఓ విద్యార్థినిపై ఈసిఐఎల్ సిఐ మనోహర్ రెడ్డి అమానుషంగా ప్రవర్తించారు. నాటి నిరంకుశ నైజాం పాలన నుండి హైదరాబాద్ విముక్తమై స్వతంత్ర్య భారతంలో కలిసింది. నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తలవంచి హైదరాబాద్ ను విలీనం చేశారు. ఈ సందర్భంగా నియంతృత్వ నిజాం పాలన తొలగినందుకు గుర్తుగా తెలంగాణవ్యాప్తంగా ప్రతి సంవత్సరం విమోచన ఉత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసిఐఎల్ లో ఏబివిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఐతే నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థినిని సిఐ మనోహర్ రెడ్డిని నడుంపై చేయి వేసి నెట్టివేసి, అసభ్య పదజాలంతో దూషించడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ ఆయన అమ్మాయిపై చేయి వేసి నెట్టడాన్ని ఏబివిపి, భాజపాతోపాటు తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉన్నా మనోహర్ రెడ్డి ఆ పనికి ఒడిగట్టాడు. విద్యార్థినిని అదుపు చేయాలనుకుంటే లేడీ కానిస్టేబుల్ కు ఆయన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.

దీంతో విద్యార్థులు ఈసిఐఎల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. అమ్మాయి పట్ల అమానుషం ప్రవర్తించిన సీఐ మనోహర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవల్సిందిగా డిమాండ్ చేశారు. సదరు కీచక పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని ఏబివిపి నాయకులు కళ్యాణ్, లక్ష్మణ్ లు డిమాండ్ చేశారు. తమను జెండా సైతం ఎగరవేయనీయలేదన్నారు. విద్యార్థిని పట్ల తనకు ఏ విధమైన దురుద్దేశం లేదని, అనుకోకుండా ఆ సంఘటన జరిగిందని మనోహర్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికే పోలీసులు, ప్రభుత్వం ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అధిరారం చేతిలో ఉంది కదాని ప్రభుత్వం తెలంగాణవారిని భయభ్రాంతులకు గురి చేసినా ఎవరూ భయపడరన్నారు. సదరు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని అలా ఐతేనే మరోసారి ఇలాంటి పునకావృతం కావని ఆమె పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X