విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి. సుబ్బరామిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి?

By Pratap
|
Google Oneindia TeluguNews

 T Subbarami Reddy
విశాఖపట్నం: పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. త్వరలో ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన న్యూక్లియర్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యస భ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి చేతుల మీదుగా ప్రవేశపెడతారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ చెప్పారు, సుబ్బరామిరెడ్డి జన్మ దిన వేడుకలకు విశాఖపట్నం వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి మాట్లాడారు.

సోనియా గాంధీకి అభిమాన పాత్రుడైన సుబ్బరామిరెడ్డికి త్వరలో కేంద్ర మం త్రి వస్తుందని జోస్యం చెప్పారు. ఎంతో ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడైన సుబ్బరామిరెడ్డి దేశ భవిష్యత్తుకు చెందిన అ తి కీలక బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం రానుండడం అభినందనీయమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X