హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పైకప్పు కూలి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినికి గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: రాజధాని నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహిళా వసతి గృహం(లేడీస్ హాస్టల్)లో ఓ గదిలోని పైకప్పు పెచ్చులు కూలింది. ఈ దుర్ఘటనలో ఫరీన్ అనే విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఫర్వీన్ అక్కమే ఎమ్మెస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు తీవ్ర గాయాలు కావటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థులు ఈ విషయమై యూనివర్శిటీలో ధర్నాకు దిగారు. అప్పుడే యూనివర్సిటీ నుండి వెళుతున్న మేయర్ కార్తీకరెడ్డిని విద్యార్థులు అడ్డగించారు. విద్యార్థులు ఎంతకు మెట్టు దిగకుండా ఆమెను అక్కడినుంటి కదలనివ్వడానికి ససేమీరా అనటంతో చేసేది లేక కార్తీకరెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X