హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ అనుచరులపై త్వరలో చర్యలు: వి హనుమంతరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: 2004లో కాంగ్రెసు ను అధికారంలోకి తీసుకువచ్చాడంటున్న వైయస్ అంతకుముందు 1999లోనే పార్టీని అధికారంలోకి ఎందుకు తీసుకు రాలేక పోయాడని రాజశేఖర్ రెడ్డి వర్గీయులను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ప్రశ్నించాడు. కాంగ్రెసు అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కడు కాదని అందరం కలిస్తేనే పార్టీ అవుతుందన్నారు. వైయస్ వల్లనే అధికారంలోకి వచ్చిందంటే ఒప్పుకోనని అందరితోపాటూ గెలుపులో ఆయన పాత్ర కూడా ఉందన్నారు. చాలామంది హేమాహేమీలు ఉన్నారని వారందరిని కాదని ఆయన్ను భుజాలకెత్తుకోవటం హాస్యాస్పదమన్నారు. హైకమాండ్ కు అన్నీ తెలుసునని రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. జగన్ సిఎం అవుతారన్న మేకపాటి వ్యాఖ్యలపై తాను పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేస్తూ జగన్ ను ఎవరైనా సమర్థిస్తే హైకమాండ్ కఠిన చర్యలు తీసుకుంటుందని విహెచ్ అన్నారు.

తెలంగాణ విషయంలో కెసిఆర్ కు స్పష్టమైన వైఖరి ఉందో లేదో తనకు తెలియదని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదన్నారు. అలాంటి వ్యక్తి గురించి తాను మాట్లాడ దల్చుకోలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఉందని, శ్రీకృష్ణ కమిటి నివేదిక డిసెంబర్ 31న వస్తుందని అప్పుడే దానిపై మాట్లాడగలమని చెప్పారు. మాటిమాటికి తెలంగాణపై సోనియాగాంధీ స్పష్టం చేయాలంటున్న చంద్రబాబు శ్రీకృష్ణ కమిటీ వేసిన విషయం అర్థం చేసుకోవాలన్నారు. సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేసేముందు చంద్రబాబు మొదట తెలంగాణపై తన అభిప్రాయాన్ని తెలపాలన్నారు. ఆ తర్వాతే సోనియాగాంధీని అడగాలని సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే సమర్థిస్తామన్న చంద్రబాబు ఆ తర్వాత తెలంగాణపై తన మాట మార్చారని విమర్శించారు. బిజెపి హయాంలో తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు అనుకూలంగా ఉంటాడని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. కెసిఆర్ అయినా, చంద్రబాబు అయినా హస్తాన్ని సవాల్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X