నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేకు మొదటి భార్య కూతురు చిక్కులు: ఇంటి వద్ద ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఇంటిముందు ఆయన మొదటి భార్య కూతురు కవిత ఆస్తిలో వాటా కోసం ఆందోళన చేస్తోంది. రామకృష్ణ తెలుగు దేశం పార్టీకి చెందిన వ్యక్తి. తన తాతకు సంబంధించిన అర ఎకరం భూమిలో తనకు 16 సెంట్లు వస్తుందని, దానిని తన తండ్రి అమ్ముకున్నాడని ఆ భూమికి సంబంధించినది తనకు రావాలని ఆమె విలేకరులతో పేర్కొన్నారు. తనకా న్యాయపరంగా రావాల్సిన వాటానే అడుగుతున్నాను గాని ఆయన సొమ్ము తనకు ఏమీ వద్దని కవిత అంటున్నారు. ఇప్పటి వరకు తను బయటకి రాలేదని, ఇన్నేళ్లుగా ఇస్తానని చెప్పటమే కాని ఇంతవరకు ఇవ్వక పోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో తను ఆందోళన చేపట్టవలసి వస్తోందని ఆమె అంటున్నారు. తన న్యాయపరంగా రావాల్సిన వాటాను అడిగితే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడని ఆరోపించారు. రాజకీయంగా దెబ్బ తీయాలని ఆందోళన చేపట్టడం లేదని, ఆయన మీడియా ముందు ఎప్పుడిస్తాడో ఖచ్చితమైన తేది చెబితే వెళ్లిపోతానని ఆమె అన్నారు.

కాగా న్యాయపరంగా తనకు రావాల్సినది ఏమైనా ఉంటే తాను ఇవ్వడానికి సిద్ధమేనని ఎమ్మెల్లే రామకృష్ణ మీడియా ప్రతినిధులతో అన్నారు. 1991లోనే మొదటి భార్య విడిపోయిందని, ఆ తర్వాత తన మొదటి భార్యకు సంబంధించిన వారి మొహం 1993నుండి తాను చూడలేదని, మళ్లీ ఇప్పుడే చూస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు. ఆమే తనను కావాలనే బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆన్నారు. కేవలం ఎన్నికలప్పుడే తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఆమె ఇలా చేస్తుందన్నారు. ఆమె వెనుక ఖచ్చితంగా రాజకీయ శక్తులు ఉన్నాయని ఆయల అనుమానం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లుగా చప్పుడు చేయకుండా ఇప్పుడు వచ్చి రాద్దాంతం చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. లీగల్ గా ఆమెకు ఎంత వస్తే అంత ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. రాజకీయాలకు తాను సేవా దృక్పథంతో వచ్చానని, ఎందరికో సహాయం చేస్తున్నాను. అలాంటిది తనకు నేను ఆన్యాయం ఎందుకు చేస్తానని ప్రశ్నించాడు.

కాగా ఎమ్మెల్యే మాటల్లో స్పష్టత లోపించింది. 1993 తరువాత వాళ్లను చూడటం ఇదే మొదటిసారి అంటూనే ఎన్నికలప్పుడే తనను రాజకీయంగా దెబ్బతీయాడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. 16 సెంట్లు అమ్ముకున్నానని చెబుతూనే ఇవ్వడానికి సమయం చెప్పకుండా న్యాయపరంగా వచ్చేది ఉంటే ఇస్తానని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. ఇన్నాళ్ళు ఏం చేసిందని మరో మెలిక పెడుతున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X