హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూమా నాగిరెడ్డిపై చిరంజీవి క్రమశిక్షణా చర్య తీసుకుంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డిపై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చర్యలు తీసుకోగలరా అనేది సందేహంగానే ఉంది. అయితే, భూమా నాగిరెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు చిరంజీవికి నివేదిస్తామని, చిరంజీవి తగిన చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. పార్టీలో ఏం చేయాలో, ఏం జరుగుతుందో తమకు ఏమీ అర్థం కావడం లేదని భూమా నాగిరెడ్డి ఇటీవల కర్నూలులోని పార్టీ నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

భూమా నాగిరెడ్డిపై చర్యలు తీసుకునే సాహసం చిరంజీవి చేస్తారా అనేది అనుమానమేనని అంటున్నారు. నిజానికి, చిరంజీవి ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పార్టీ వ్యవహారాలతో విసిగిపోయి విమర్శలు చేస్తూ బయటకు వెళ్లిపోయినవారే ఎక్కువ. భూమా నాగిరెడ్డికి కూడా అదే వర్తిస్తుందేమో. పైగా, భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు చాలా కాలంగా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అవసరమైతే పార్టీని ధిక్కరించి జగన్ వైపు నిలబడతారనే ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X