• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆలయాల నిర్మాణం రాజకీయ పార్టీల పని కాదు: వెంకయ్యనాయుడు

By Srinivas
|
Venkaiah Naidu
న్యూఢిల్లీ: ఆలయాలు, ప్రార్థనామందిరాలు, చర్చ్ లు, మసీదులు నిర్మించటం రాజకీయ పార్టీల పని కాదని బిజెపి జాతీయ అధ్యక్షుడు ముప్పారపు వెంకయ్యనాయుడు అన్నారు. కోర్టు తీర్పును బిజెపి స్వాగతిస్తుందని ఆయన విలేకరులతో చెప్పారు. కోర్టు తీర్పుపై వక్ఫ్ బోర్డు గానీ, హిందూ మహాసభ కాని సంతృప్తి చెందలేదని ప్రకటించిన నేపథ్యంలో వారికి తీర్పు నచ్చకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చని ఆయన సూచించారు. అయితే దీనిని ఇప్పటీకైనా కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

తీర్పు అనంతరం ఎలాంటి ఆమానుష ఘటనలు జరగపోవటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడూ ఇలాగే శాంతిగా ఉండాలని ఆయన కోరారు. తీర్పుపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారన్నారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే బిజిపిని మతతత్వ పార్టీగా చూపించడానికి ప్రయత్నించాయన్నారు. కానీ కోర్టు తీర్పుతో వారి ఆరోపణలు అవాస్తవమయ్యాయని, తాము ఒక మతానికి అనుకూలం అన్న ఆలోచన పటాపంచలయ్యిందన్నారు. తాము కేవలం అత్యధికుల మనోగతాన్ని కోవలోకి తీసుకొని మాట్లాడామన్నారు. కాని మందిరం నిర్మిస్తామని మాత్రం ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పలేదన్నారు. కోర్టు తీర్పు పట్ల అత్యధికులు సంతోషంగా ఉన్న కారణంగా దీనిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X