వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరికొత్తగా దట్స్ తెలుగు న్యూస్ ఇప్పుడు మీ అరచేతిలోని మొబైల్ ఫోన్లో..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Thatstelugu news on your cell phone
యావత్ ప్రపంచంలో విస్తరించి ఉన్న "తెలుగు" ప్రజలకు, తమ "తెలుగుజాతి" అస్తిత్వం నిలబెట్టుకోవాలనే కోరిక సహజంగానే ఉంటుంది. నిజానికి ఏ జాతి, మత, దేశ, భాష, సంస్కృతులకు చెందిన మనుష్యులైనా, ఆయా వర్గవిశిష్ఠతలనూ, తమ ప్రత్యేక లక్షణాలనూ పరిరక్షించుకోవాలనీ, తమ "మూలం" ఇది అన్న ఒక సంఘీభావాన్ని ప్రకటించుకోవాలనీ ఆశించటం అనేది, మానవ మనుగడలోనే అంతర్లీనమైన ఓ లక్షణం. మరి తెలుగువారి అస్తిత్వానికి ప్రథమ చిహ్నం "తెలుగు" భాషే కదా!. అందుకే ప్రపంచంలోని సమస్త విషయ పరిజ్ఞానానికి భాండాగారమై ఎదుగుతున్న ఇంటర్ నెట్ లో, తెలుగువారందరూ ఆయా విషయాలను తమ మాతృభాషలోనే చదువుకొని, వినోదాత్మక విషయాలతో ఆనందించి, విమర్శనాత్మక విషయాలను చర్చించి, విజ్ఞానాన్ని పెంచుకునే మార్గంలోనే "తెలుగు వాడుక" నీ పెంచుకొని, తెలుగు ప్రజలందరూ ఏకమై ఎదగాలన్న ఒక దృక్పదంతో "దట్స్ తెలుగు" ఆవిర్భవించింది.

భారత దేశం ఒక బహుళభాషా ప్రాంతం. భారతదేశంలో వివిధ రకాల మతాలవారు, జాతుల వారు నివశిస్తున్నారు. భారతదేశంలో చాలా భాషలను మాట్లాడే ప్రజలు ఉన్నారు. అందువల్లే భారతదేశంలో సెల్ ఫోన్ మార్కెట్ చాలా త్వరగా అభివృధ్దిని సాధించింది. యావత్ ప్రపంచం మొత్తం మీద 650మిలియన్ మంది మొబైల్ ని ఉపయోగించే వాళ్శు ఉంటే అందులో 12 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ లో సౌకర్యవంతంగా ఉపయాగిస్తున్నారు. మనిషికి సమాజంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం అనేది ముఖ్యం. సమాజంలో జరిగిన మంచి చెడు అతనికి తెలియాలంటే ప్రతి రోజు జరిగే విషయాలు అతనికి తెలిసుండాలి. అలా తెలుసుకోవాలంటే అతనికి ముఖ్యంగా న్యూస్ పై అవగాహాన ఉండాలి. అలా అవగాహాన కలిగించాలంటే ప్రతి ఒక్కరికి తన మదర్ టంగ్ లో వార్తలు ఉంటే అతనికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఎక్కువ మంది జనాభా మన దేశంలో ఇంగ్లీష్ లో వార్తలు ఉండడం వల్ల పెద్ద ఆశక్తి కనబరచడం లేదు. అంతేకాకుండా వారికి సంబంధించిన మదర్ టంగ్ లో ఉంటే ఆశక్తి కనబరుస్తున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది.

దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి మొబైల్ వార్తలు తేవాలనే ఉధ్దేశ్యంతో, అంతేకాకుండా వారి యొక్క ప్రాంతీయ భాషలలో వార్తలను మీముందు ఉంచడానికి వన్ ఇండియా ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మీరు చేయాల్సిందేమిటంటే వన్ ఇండియా వారు కొత్తగా ప్రవేశపెట్టనటువంటి ఓ అప్లికేషన్ ను మీ మొబైల్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడమే. ఈ అప్లికేషన్ కనుక మీరు డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ నుంచి మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని మీకు వన్ ఇండియా ఉచితం గా సమర్పిస్తుంది. దీని ద్వారా మీరు ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించి లాంగ్వేజ్ ఫాంట్స్ ని మీ మొబైల్ లో పోందగలుగుతారు. ఒకసారి కనుక ఈ అప్లికేషన్ మీరు మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్నట్లేతే తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ లాంటి అన్ని లోకల్ భాషలు యొక్క ఫాంట్స్ ని మీ మొబైల్ హాండ్ సెట్ లో చదువుకోవచ్చు. వార్తలుతో పాటు మా వన్ ఇండియాలో ఉన్న అన్ని పాపులర్ విషయాలను మీరు తెలుసుకోవచ్చు. ఇలా చేయడానికి కారణం మీకు ఏదైనా న్యూస్ సమాచారం కావాలంటే మీరు డెస్క్ టాప్ లో నుంచే కాకుండా మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా మీకు నచ్చిన సైట్ ని చదువుకోవచ్చు. నోకియా, బ్లాక్ బెర్రి, సామ్ సాంగ్ మరియు సోని ఎరిస్కన్ లాంటి మొబైల్ ఫోన్స్ ఉన్న వారు తమ ఫోన్ల నుండి (జిపిఆర్ యస్) సిస్టమ్ ద్వారా యావత్ ప్రపంచం మొత్తంలో ఎప్పుడైనా, ఎక్కడైనా మీకు కావాల్సిన న్యూస్ సైట్స్ ని చదువుకోవచ్చు.

తెలుగు భాషను కలుషితమనకుండా, తెలుగు భాషాభివృద్ధికై ఇతర భాషా పదాలను స్వీకరిస్తూ, సరళ తెలుగు భాషలో కూడా నేటి ప్రపంచాన్ని చర్చించడం, తద్వారా "తెలుగు వాడుక" ను పెంచడం మా అభిమతం. ముఖ్యంగా తెలుగు లోకం లోకాన్నంతా "తెలుగు" లోనే తెలుసుకోవాలన్నది, తెలుగు మనిషిని ఉన్నతస్థాయిలో ఉంచగలుగుతుంది అని మా అభిప్రాయం. అందుకే ఇలాంటి సరికొత్త అధ్యయానికి దట్స్ తెలుగు శ్రీకారం చుట్టింది.

మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులతో కూడా తెలుగు మొబైల్ న్యూస్ ని పంచుకోవడం మరచిపోకండి. మీకేమైనా సందేహాలు ఉన్నట్లైతే ఈ మెయిల్ కు మీ సూచనలను తెలియజేయండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X