హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఓదార్పు ఎఫెక్ట్: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు వై గోపాల్ రెడ్డిపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ప్రభావం వడింది. ఆయనకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఓదార్పు యాత్రలో పాల్గొంటానని గురువారం చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశిచారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని డిఎస్ గోపాల్ రెడ్డిని ఆదేశించారు. గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పిసిసి జిల్లా సమన్వయకర్త సెప్టెంబర్ 15వ తేదీన ఇచ్చిన నోటీసు విషయాన్ని, ఆ నోటీసుకు గోపాల్ రెడ్డి వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా డిఎస్ తాజా షోకాజ్ నోటీసులో ప్రస్తావించారు.

పార్టీతో 15 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గోపాల్ రెడ్డి 15వ తేదీ డిసిసి సమావేశానికి ఆహ్వానించామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, పాల్పడితే చర్యలు తప్పవని ఆ సమావేశంలో చెప్పామని, అయినా వినకుండా గోపాల్ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని డిఎస్ తన లేఖలో వివరించారు. డిసిసి అధ్యక్ష పదవి చాలా కీలకమైందని, ఆ హోదాలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని డిఎస్ అన్నారు. పార్టీ అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పినప్పటికీ గోపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను పార్టీ అనుమతి లేని కార్యక్రమంగా పరిగణిస్తూ డిఎస్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X