నిమ్స్ నుంచి సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు డిశ్చార్జి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం నిందితుడు బి. రామలింగరాజు శనివారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. హెపటైటిస్- సి వ్యాధికి ఆయన 8 నెలలుగా నిమ్స్‌లో చికిత్స పొందుదున్నారు. ఆయనకు బెయిలు కూడా మంజూరు అయినా చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉండటంతో చికిత్స పొందుతున్నారు. శనివారం డిశ్ఛార్జి అయినా ఆయన మరో ఆసుపత్రిలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
రామలింగరాజుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సిబిఐ వ్యతిరేకిస్తోంది. రామలింగరాజుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారమే సుప్రీంకోర్టు రామలింగ రాజుకు నోటీసులు జారీ చేసింది.