వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఫ్రజా ఫ్రంట్ ఆవిర్భావం, ఎవరికీ వ్యతిరేకం కాదు: గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్‌: తాము ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణ సాధనే తమ ధ్యేయమని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసిన అనంతరం ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించేందుకు తాము ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ప్రజా గాయకుడు గద్దర్‌ సారథ్యంలో శనివారం నాడిక్కడ తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస సమన్వయ సమావేశం జరిగింది. రాజకీయ ఐకాస, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ల తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. డిసెంబరు నాటికి తెలంగాణ కోరుతున్న రాజకీయేతర సంఘాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమించాలని సంకల్పించారు. దీనికి 'తెలంగాణ ప్రజాఫ్రంట్‌' అనే పేరు నిర్ణయించారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రంట్‌కు సారథ్యం వహించాల్సిందిగా అన్ని సంఘాలు, నాయకులు గద్దర్‌ను కోరారు. దీనికి ఆయన మొదట ఒప్పుకోలేదు. తనకు కొంత వ్యవధి కావాలన్నారు. ప్రజాఫ్రంట్‌ రూపం ఎలా ఉండాలి, కమిటీల ఎన్నిక, ఉద్యమ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ప్రజాఫ్రంట్‌కు కార్యవర్గాన్ని ఈ సందర్భంగానే ఏర్పాటు చేసుకుంటారు. గద్దర్‌ కూడా వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉంది. డిసెంబరులో 20వేల మంది కళాకారులతో ఒక భారీ సభను నిజాం కళాశాలలో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. కోదండరామ్ నేతృత్వం వహిస్తున్న రాజకీయ జెఎసితో తమకు సంబంధం లేదని గద్దర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీర్ఘకాలికంగా ఉద్యమం జరుగుతోందని, ఇది వ్యక్తుల చుట్టూ మాత్రమే ఉండకుండా సమష్టి నాయకత్వంలో ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజా ఉద్యమాన్ని సమన్వయం చేసే బాధ్యతను ఫ్రంట్‌ తీసుకుంటుందని గద్దర్ అన్నారు. డిసెంబర్‌ 9నాటి చిదంబరం ప్రకటన కూడా ఉద్యమ ఫలితమేనని, దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన తరుణంలో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ పేరుతో వెనక్కు తీసుకెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయపార్టీలు పార్లమెంటుముందు తెలంగాణ బిల్లును పెట్టించ లేకపోయాయని, ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందనీ, రాష్ట్రాన్ని సాధించుకోవాలని ప్రజలకు వివరించి చెప్తామని గద్దర్‌ చెప్పారు. ఉద్యమ క్రమంలో వ్యక్తులు, సంస్థలు పుడుతూ ఉంటాయి- పోతూ ఉంటాయనీ, వాటికి విలువలేదన్నారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలంటే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాల్సిందేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X