• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త్వరలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తెలంగాణ పర్యటన

By Pratap
|
Chiranjeevi
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు చెప్పారు. అయితే, ఎప్పుడు పర్యటిస్తారనేది ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని చిరంజీవి కూడా గతంలో చెప్పారు. అదే మాటను కోటగిరి విద్యాధర రావు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై తమ వైఖరిలో మార్పు లేదని, తాము సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ పార్టీని వీడి బయటకు వెళ్లలేదని, అందువల్ల తిరిగి పార్టీలోకి రావడమనేది ఉండదని, వారు పార్టీలోనే ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో పార్టీ అడ్ హాక్ కమిటీలు వేస్తామని ఆయన చెప్పారు. నవంబర్ నెల నాటికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X