• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వరంగల్ జడ్పీలో శంకర్ దాదా గాంధీ: జాతిపితకు అవమానం

By Srinivas
|

Warangal
వరంగల్: వరంగల్లో జాతిపిత మహాత్మాగాంధీకి ఘోర అవమానం జరిగింది. వరంగ జెడ్పీ సమావేశంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్ పర్సన్ ధన్వంతరి ఫోటోలతో పాటు వారిద్దరి మధ్య జాతిపిత గాంధీ ఫోటో పెట్టారు. అయితే గాంధీ ఫోటో పెట్టడంలో తప్పు లేదు. కాని జిల్లా పరిషత్ అధికారులు పెట్టింది మన మహాత్ముడికి డూప్లికెట్ ఫోటోను. చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలోని బొమ్మను గోడకు తగిలించారు. అంతేకాకుండా కింద రాసి మహాత్ముడి పేరులో హ కు దీర్ఘం లేక పోవటం శోచనీయం. ఈ కథనాన్ని ఓ తెలుగు ఛానెల్ ప్రసారం చేసింది.

28 లక్షల రూపాయలతో జెడ్పీ భవనాన్ని కొత్తగా నిర్మించారు. అందులోకి భవనం మారటంతో ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్ పర్సన్ ఫోటోలతో పాటు డూప్ గాంధీజీని పెట్టారు. అయితే అధికారులు సమావేశానికి ముందు తీసివేద్దామనుకున్నప్పటికీ అది కుదరలేదు. కాగా ఇంతకుముందు వరంగల్ కలెక్టరేట్ లోనే మహాత్ముడికి జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X