హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య చేతులెత్తేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని సొంత పార్టీకే చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్న స్థితిలో ఆ వివాదంపై బుధవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీవ్రమైన చర్య జరిగింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై ప్రభుత్వం తగిన చర్యలకు పూనుకోవాలని పలువురు మంత్రులు ప్రతిపాదించారు. అయితే, ఆ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని రోశయ్య చెప్పారు. ఎపిఐఐసి స్వతంత్ర సంస్థ అని, ఆ సంస్థనే విచారణ జరుపుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణ జరపాలని ప్రభుత్వం ఎపిఐఐసిని ఆదేశించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

కాగా, సహకార సంఘాల ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పాలక మండళ్ల గడువును ఆరు నెలలు పొడగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 124 ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలకు ఉచిత విద్యుత్తును, మంచినీటిని అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 2008 డిఎస్సీ నియామకాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి ఉద్యమాలకు బ్రేకులు వేయడానికి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X