చిరంజీవికి పద్మభూషణ్ రాజకీయమే: నందుల గొడవ

Nattikumar
హైదరాబాద్: నంది అవార్డుల గొడవ ఆదివారం తెలుగు చలన చిత్ర మండలి సమావేశాన్ని ఊపేసింది. మండలి చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి తీరుపై మరో నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి భారత ప్రభుత్వ అవార్డు పద్మ భూషణ్ రావడంలో రాజకీయం లేదా అని నట్టి కుమార్ ప్రశ్నించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దాసరి నారాయణరావుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు రావడంపై ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు చేసిన విమర్శలను నట్టి కుమార్ తిప్పి కొట్టారు. దాంతో తనను కార్నర్ చేయడానికే నిర్మాతల మండలి చైర్మన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. శ్యాంప్రసాద్ రెడ్డిపై ఆయన నిర్మాతల మండలి సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాము మండలి సమావేశంలో చేసిన తీర్మానాలపై సంతకం పెట్టడానికి సమయం లేని శ్యాంప్రసాద్ రెడ్డి ఐదుగురి నిర్ణయంపై సంతకం చేసే సమయం మాత్రం దొరికిందా అని ఆయన అడిగారు. ఎవరినైనా సస్పెండ్ చేసేటప్పుడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ పద్ధతి శ్యాంప్రసాద్ రెడ్డి పాటించలేదని ఆయన విమర్సించారు. పద్మభూషణ్ అవార్డుల్లో కూడా రాజకీయం ఉందని ఆయన అన్నారు. రాజకీయం చేసి దాసరి నారాయణ రావు ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారని, ఆ అవార్డు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజాకు రావాల్సి ఉందని ప్రజారాజ్యం కార్యకర్తలు విమర్శలకు దిగారు. దీంతో నట్టి కుమార్ దాసరిని సమర్థిస్తూ ప్రకటనలు చేశారు. మీడియాతో ఎందుకు మాట్లాడకూడదని నట్టికుమార్ శ్యాంప్రసాద్ రెడ్డిని ఆదివారం అడిగారు. దాసరికి నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

చిరంజీవి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా, ఇళ్లు తగలబెడతారా అని ఆయన అడిగారు. వారికి తాను భయపడేది లేదని ఆయన అన్నారు. తాను చేతులు ముడుచుకుని కూర్చోబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తనను నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేస్తే తామంతా సమావేశమై తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+