వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్ వెనుక వేరే శక్తులు ఉన్నాయి: అరుణోదయ విమలక్క

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vimalakka
హైదరాబాద్: గద్దర్ స్థాపించిన ప్రజా ఫ్రంట్ వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని ప్రజా గాయకురాలు, అరుణోదయ విమలక్క అరోపించారు. ప్రజా ఫ్రంట్ కు స్పష్టత లేదని ఆమె అన్నారు. మమ్మల్లి ఉద్యమ ద్రోహులు అన్న వారు వెంటనే వారి మాటలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 35 ఏళ్లుగా నిస్వార్థంతో ఉద్యమం చేస్తున్నామని అలాంటి మమ్మల్లి ఉద్యమ ద్రోహులు అని పేర్కొనటం హాస్యాస్పదమన్నారు.

తెలంగాణ ప్రజా ఫ్రంట్ సమావేశంలో ప్రంట్ అనుకూలురైన వారితోనే మాట్లాడించారని ఆమె ఆరోపించారు. ఫ్రంట్ సమావేశం ఏకపక్షంగా జరిగిందన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలనుకోవటం ఎన్నికలను సమర్ధించటమే అవుతుందని అన్నారు. మేము ఎన్నికలకు, ఉద్యమాన్ని వేరుగా చూస్తామని ఆమె చెప్పారు. మమ్మల్లి ఎన్నికలు కోరుకునే వారిగా చిత్రీకరించడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఎప్పుడూ ఎన్నికలకు దూరమేనని ఆమె చెప్పారు. అయితే తెలంగాణ కోసం అందరినీ కలుపుకొనిపోవాలని మాత్రమే తాము చెప్పామని అమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X