వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bharadwaj
బెంగళూర్: కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ భరద్వాజ్ సిఫార్సు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 16 మంది శాసనసభ్యులపై వేటు వేసి మూజువాణీ ఓటుతో యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ బోపన్న ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. బలపరీక్ష రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందనే అభిప్రాయంతో భరద్వాజ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఆయన న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా కర్ణాటక పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేసి స్పీకర్ బోపన్న 16 మంది శానససభ్యులపై అనర్హవత వేటు వేశారనే అభిప్రాయంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, కర్ణాటక శాసనసభలో సోమవారం కనీవినీ ఎరుగని వాతావరణం నెలకొంది. సభ వాయిదా పడిన తర్వాత కూడా శాసనసభలో గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. యెడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గిన తీరుపై కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు గవర్నర్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. అనర్హత వేటు పడిన శాసనసభ్యులు కూడా రాజభవన్ ముందు ఆందోళనకు దిగారు. స్పీకర్ నిర్ణయాన్ని బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు సమర్థించారు. అసమ్మతి శాసనసభ్యులు చొక్కాలు చింపుకుని వచ్చారని ఆయన అన్నారు. అనర్హతకు అర్హత సాధించింది వారేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు, జెడి(ఎస్) విధ్వంసక పాత్ర పోషించాయని బిజెపి నేత నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

విశ్వాస పరీక్ష నెగ్గిన తీరును జెడిఎస్ నేత కుమారస్వామి తప్పు పట్టారు. అది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ఆయన విమర్శించారు. విశ్వాస తీర్మానం చట్టప్రకారం చెల్లదని ఆయన అన్నారు. యెడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేకంగా వచ్చిన ఓట్లను స్పీకర్ లెక్కించి ఉండాల్సిందని ఆయన అన్నారు. శాసనసభ సమావేశమే జరగలేదని కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానించారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని వారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X