వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలపై కర్ణాటక స్పీకర్ వేసిన అనర్హహత వేటు చెల్లుతుందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

karnataka vidhana soudha
బెంగళూర్: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది.కేవలం 15 నిమిషాల్లో శాసనసభ సమావేశం ముగిసింది. మూజువాణీతో యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షల నెగ్గినట్లు ప్రకటించి స్పీకర్ బోపయ్య శాసనసభను వాయిదా వేశారు. 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై అనర్హవత వేటు వేసి, వారిని సభకు అనుమతించకుండా విశ్వాస పరీక్షలో యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాలను మార్చకుండా యెడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కునేలా చూడాలని గవర్నర్ భరద్వాజ్ స్పీకర్ ను ఆదేశించారు. తన వ్యవహారాల్లో గవర్నర్ అనవసరమైన జోక్యం చేసుకున్నారని గవర్నర్ ను స్పీకర్ తప్పు పట్టారు.

స్పీకర్ స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ అని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, 16 మందిపై స్పీకర్ అనర్హత వేటు చెల్లుతుందా అనేది ప్రశ్న. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని స్పీకర్ బోపయ్య దుర్వినియోగం చేశారనే విమర్శ వినిపిస్తోంది. ఆ చట్టం రెండు సందర్భాల్లో మాత్రమే వర్తిస్తుందని అంటున్నారు. వాటిలో ఒకటి - శాసనసభ్యుడు తనంత తానుగా పార్టీ రాజీనామా చేసినప్పుడు, రెండోది - పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు వేసినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని చెబుతున్నారు. ఈ రెండు సందర్భాలు లేకుండానే స్పీకర్ బోపయ్య 16 మందిపై వేటు వేశారని, అది చెల్లదని న్యాయనిపుణులు కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

కాగా, తిరుగుబాటు శాసనసభ్యులు గవర్నర్ భరద్వాజ్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కర్ణాటక రాజకీయాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. గవర్నర్ ఆదేశాలను స్పీకర్ ధిక్కరించడాన్ని ఎలా తీసుకోవాలనే యోచనలో పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X