నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామా చేసి జగన్ మద్దతివ్వండి: నల్లపురెడ్డికి టిఎన్ఎస్ఎఫ్ ఆల్టిమేటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

TNSF
నెల్లూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు మద్దతిస్తానన్న తెలుగు దేశం పార్టీ అసమ్మతి శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలుగు దేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్(టిఎన్ఎస్ఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్లపురెడ్డి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.

తెలుగు దేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. జగన్ కు, నల్లపురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లపురెడ్డి జగన్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే వెంటనే తెలుగు దేశం పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మద్దతునిచ్చుకోవచ్చునని సూచించారు. మద్దతు ఉపసంహరించుకోవటమా లేక రాజీనామా చేయటమా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఆంతకుముందు. సోమవారం నల్లపురెడ్డి జగన్ ఓదార్పు యాత్రను సమర్థించిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలకు ఓదార్పు పేరుతో జగన్ సహాయం చేయటం మంచి పరిణామమని, పార్టీలకతీతంగా జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర నెల్లూరులో ఉన్నప్పుడు తానూ పాల్గొంటానని ఆయన చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X