వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో ప్యాచ్ అప్ యత్నాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో విభేదాలను తెర దించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పాల్గొనే అంశంపై వెంటనే తేల్చాలని పట్టుబడుతూ గద్దర్ తో విభేదించిన విమలక్క విభేదాలను తొలగించుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆమె గద్గర్ కు ఓ లేఖ రాశారు. కొన్ని అంశాలపై చర్చకు సిద్ధపడి, అవగాహనకు వస్తే తాము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ విమలక్క ఫ్రంట్ అడ్ హాక్ కమిటీ చైర్మన్ గద్దర్ కు లేఖ రాశారు. దానికి గద్దర్ వెంటనే ప్రతిస్పందించారు. ఈ నెల 14వ తేదీన జరిగే స్టీరింగ్ కమిటీకి తనతో విభేదించిన వర్గాన్ని ఆహ్వానించారు. ఏకవాక్యంతో హన్మాండ్లుకు ఆయన ఆహ్వానం పంపారు.

ఎన్నికల్లో పాల్గొనే విషయంపై తేల్చకపోవడంతో విమలక్క వర్గానికి చెందిన వారు గద్దర్ తో విభేదించి సమావేశం బయటకు వెళ్లిపోయారు. సమావేశంలో తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజా ఉద్యమాలను చేపట్టడమే కాకుండా ఎన్నికల్లో పాల్గొనడాన్ని ఓ పోరాట రూపంగా గుర్తించాలని విమలక్క వర్గం వాదించింది. అవసరమైనప్పుడు దానిపై నిర్ణయం తీసుకుందామని గద్దర్ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో ఫ్రంట్ సమావేశంలో విభేదాలు తలెత్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X